Sat Jan 31 2026 06:07:11 GMT+0000 (Coordinated Universal Time)
మేడారం భక్తులకు ఆర్టీసీ ఏర్పాట్లు: మంత్రి పొన్నం
మేడారం భక్తులకు ఆర్టీసీ సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు

మేడారం భక్తులకు ఆర్టీసీ సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిసిన తర్వాత భక్తులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడానికి ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
నిన్న రాత్రి నుంచి...
నిన్న రాత్రి నుంచి మేడారంలో ఆర్టీసీ బస్సులు లేక భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడి అధికారులతో సమీక్ష చేశారు. మేడారంలో భక్తుల రద్దీ, బస్ స్టేషన్ లో ఇబ్బందులపై మంత్రి సీతక్క, డీజీపీ, ఆర్టీసీ ఎండీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో చర్చించారు. అమ్మవారి దర్శనం తర్వాత భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Next Story

