Mon Mar 30 2026 11:37:49 GMT+0530 (India Standard Time)
YSRCP : నేడు వైసీపీ చలో మూలా పేట
వైసీపీ నేతలు నేడు మూలాపేట పోర్టు కు వెళ్లనున్నారు

వైసీపీ నేతలు నేడు మూలాపేట పోర్టు కు వెళ్లనున్నారు. మూలాపేట పోర్టుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించామని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులను చేపట్టడం లేదని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట లో ఏప్రిల్ 19 2023 న నాలుగు వేల కోట్ల రూపాయలతో పనులు చేయాలని నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు.
అనుమతి లేదంటున్న పోలీసులు...
అరవై నుంచి డెబ్భయి శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆరోపిస్తూ వైసీపీ నేతలు చలో మూలపేట ప్రాంతానికి పిలుపు నిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. రేవాడలో మాత్రం సభ జరుపుకోవడానికి అనుమతిచ్చామని తెలిపారు.
Next Story

