Sat Apr 19 2025 08:51:03 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరవధిక సమ్మె
విశాఖ స్టీల్ ప్లాంట్ లో నేటి నుంచి కార్మికులు సమ్మెకు దిగనున్నారు. నిరవధిక సమ్మెలో పాల్గొననున్నట్లు ప్రకటించారు

విశాఖ స్టీల్ ప్లాంట్ లో నేటి నుంచి కార్మికులు సమ్మెకు దిగనున్నారు. నిరవధిక సమ్మెలో పాల్గొననున్నట్లు ప్రకటించారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకు రావాలని కోరుతూ ఈ సమ్మెకు దిగనున్నారు. కాంట్రాక్టు కార్మికులను పెద్ద సంఖ్యలో తొలగించడంతో సమ్మెకు దిగుతున్నట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల యూనియన్లు చెబుతున్నాయి.
కార్మికులను తొలగించడంతో
దాదాపు పథ్నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడంతో సమ్మె సైరన్ మోగించినట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. అయితే రెగ్యులర్ ఉద్యోగులను నేటి నుంచి రద్దు చేసినట్లు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రకటించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తుంది. కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉక్కు పోరాట కమిటీ ప్రకటించింది.
Next Story