Mon Dec 09 2024 09:02:02 GMT+0000 (Coordinated Universal Time)
సృజన.. అందుకే విషం తీసుకుందా..?
హైదరాబాద్‌లోని చందానగర్‌లో నివాసముండే ముంజేటి ఈశ్వరరావు, అనురాధ దంపతుల కుమార్తె సృజనకు విశాఖకు చెందిన
విశాఖ మధురవాడలో పెళ్లి పీటలపై నవ వధువు సృజన మృతి చెందిన సంగతి తెలిసిందే..! మధురవాడ నగరం పాలెంలో నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు చేయగా.. కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు.
సృజనది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఆమె పాయిజన్ తీసుకుని చనిపోయినట్లు ఇండస్ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చిందన్నారు పోలీసులు. ఆమె బ్యాగులో గన్నేరు కాయల తొక్కు కనిపించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. సృజన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలు అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తాజాగా సృజన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన ప్రాణాల మీదకు తెచ్చుకుందని.. ఆ ప్రయత్నంలో ఆమె ప్రాణాలే పోయాయని పోలీసులు తెలిపారు.
ప్రేమ వ్యవహారం:
పెళ్లికి 3 రోజుల ముందు ఇంస్టాగ్రామ్ లో పరవాడకు చెందిన ప్రియుడు మోహన్‌తో చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతడికి సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి సమయం కావాలని మోహన్ సృజనను కోరినట్టు తెలిపారు. పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పింది. పెళ్లి ఆపేందుకు సృజన విష పదార్థం తీసుకుంది. ఆసుపత్రికి ఆమెను తరలించగా.. ఆమెను కాపాడడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో చికిత్స పొందుతూ సృజన మృతి చెందింది.
హైదరాబాద్‌లోని చందానగర్‌లో నివాసముండే ముంజేటి ఈశ్వరరావు, అనురాధ దంపతుల కుమార్తె సృజనకు విశాఖకు చెందిన నాగోతి అప్పలరాజు, లలిత దంపతుల కుమారుడు శివాజీకి పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం అనంతరం విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా జరిగాయి. వీరి వివాహానికి మే 11న ముహూర్తం నిర్ణయించారు. మధురవాడ కళానగర్‌లో ఏర్పాట్లు చేశారు. వివాహ వేడుకలో వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్న వేళ సృజన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని ఇండస్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సృజన మరణించింది.
News Summary - madhurawada srujana death mystery due to love
Next Story