Thu Mar 27 2025 03:06:46 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. నిన్న విశాఖపట్నానికి చేరుకున్న నిర్మలాసీతారామన్ కు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లతో పాటు పలువురు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చారు.
బడ్జెట్ అనంతర చర్చ...
నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో నేడు విశాఖలో జరిగే బడ్జెట్ అనంతర చర్చలలో నిర్మలాసీతారామన్ పాల్గొననున్నారు. దీంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా నిర్మల పాల్గొనే అవకాశముంది.
Next Story