Sat Dec 07 2024 13:53:34 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : విశాఖ బీచ్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం
విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్కే బీచ్ వద్ద ఉన్న డైనో పార్క్ లో మంటలు చెలరేగాయి
విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్కే బీచ్ వద్ద ఉన్న డైనో పార్క్ లో మంటలు చెలరేగాయి. డైనో పార్క్ మొత్తం మంటల్లో బూడిదగా మారింది. పెద్దయెత్తు మంటలు ఎగిసిపడుతుండటంతో ఆర్కే బీచ్ వద్ద ఉన్న పర్యాటకులు భయాందోళనలతో పరుగులు తీశారు. డైనో పార్క్ ను ఒక ప్రయివేటు సంస్థ నిర్వహిస్తుంది.
డైనో పార్క్....
అయితే ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ గా అగ్ని ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక సిబ్బంది ప్రాధమికంగా గుర్తించారు. పెద్దయెత్తున మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా వెంటనే మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి వచ్చినట్లు సమాచారం. బీచ్ రోడ్ లో ఉన్న డైనో పార్క్ రెస్టో కేఫ్ మొత్తం కాలి బూడిదయింది. నష్టం లక్షల్లో ఉంటుందని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు.
Next Story