Sun Apr 12 2026 10:47:09 GMT+0530 (India Standard Time)
చందనోత్సవానికి ఆన్ లైన్ టిక్కెట్లు
ఈనెల 20న సింహాచలం చందనోత్సవం జరగనుంది

ఈనెల 20న సింహాచలం చందనోత్సవం జరగనుంది. చందనోత్సవానికి ఈనెల 17 వరకు వెబ్సైట్లో టికెట్ల విక్రయం నిర్వహిస్తున్నారు. రూ.300, రూ.1000 టికెట్ల విక్రయం చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రేపటి నుంచి ఆఫ్లైన్ టికెట్లు కూడా విక్రయిస్తామని చెప్పారు.
ఆఫ్ లైన్ టిక్కెట్లు...
ఎంపిక చేసిన బ్యాంకుల్లో విక్రయాలు ఉంటాయని అధికారులు తెలిపారు. సింహాచలం చందనోత్సవానికి ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది జరిగిన ఘటనతో అధికారులతో పాటు ప్రభుత్వం కూడా అప్రమత్తమై భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది.
Next Story

