Sun Feb 01 2026 23:00:50 GMT+0000 (Coordinated Universal Time)
పుట్టినరోజుకు అరకు వెళితే.. అర్ధరాత్రి ఆ ఇంట్లో దూరి
విశాఖపట్నంలో భారీ చోరీ జరిగింది. విశాఖ సిటీ శివారు ప్రాంతంలో భారీగా బంగారు నగదు చోరీ జరిగింది.

విశాఖపట్నంలో భారీ చోరీ జరిగింది. విశాఖ సిటీ శివారు ప్రాంతంలో భారీగా బంగారు నగదు చోరీ జరిగింది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేగి వారి వీధి లో లంక అరుణ ఇంటి లో 10 తులాల బంగారం యాభై వేలు నగదు చోరీకి గురయింది. లంక అరుణ తన ఇంటిపై అమ్మాయి పుట్టినరోజుకి అరకు వెళ్లగా అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు.
సీసీ కెమెరాలు...
అయితే బాధితురాలు లంక అరుణ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లంక అరుణ ఇంటి వద్ద క్లూస్ టీమ్ తో తనిఖీలు నిర్వహించాయి. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలించే పనిలో పోలీసులు ఉన్నారు.
Next Story

