Fri Dec 05 2025 16:39:24 GMT+0000 (Coordinated Universal Time)
visakhapatnam : విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు చేరుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. రేపు జరగనున్న యోగా డే వేడుకల్లో పాల్గొనేందుకు ఒడిశా నుంచి విశాఖకు చేరుకున్న ప్రధానికి ఏపీ నేతలు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు.
ఐఎన్ఎస్ డేగాకు...
అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రధాని నరేంద్ర మోదీ వైమానిక స్థావరానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, గవర్నర్ తో పాటటు ఎంపీలు స్వాగతం పలికారు. రాత్రికి మోదీ విశాఖలోనే బస చేస్తారు. రేపు యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
Next Story

