Fri Feb 14 2025 17:57:54 GMT+0000 (Coordinated Universal Time)
Visakha : ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తిన పవన్
భారత దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తూ దేశాన్ని ముందు నడిపిస్తున్నది మన ప్రధాని మోదీ అన్నారు

భారత దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తూ దేశాన్ని ముందు నడిపిస్తున్నది మన ప్రధాని మోదీ అని పవన్ కల్యాణ్ అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నడక సాగించినా ప్రయోజనం లేదని, కానీ అందరినీ కలుస్తూ వారిని ఒకతాటిపై నడిపిస్తూ మన ప్రధాని నరేంద్ర మోదీని దేశ ప్రజలు ఆదరిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేని సమయంలో అండగా నిలబడేందుకు నేడు ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.
ఎన్టీఏ ప్రభుత్వం రావాలని...
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ప్రజలు బలంగా కోరుకున్నారని, రెండులక్షల కోట్ల పై చిలుకు పెట్టుబడులు ఈరోజు వచ్చాయంటే ఆయనే కారణమని తెలిపారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు మోదీ సంకల్పానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదేళ్ల అవినీతి పాలనకు చరమగీతం పాడిన మోదీకి ధన్యావాదాలు తెలిపారు. సమర్థవంతమైన చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళతామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ దేశాన్ని మరింత ముందుకు నడిపించేలా ప్రధాని మోదీకి సంపూర్ణ ఆయురోరాగ్యాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరారు.
Next Story