Sat Mar 21 2026 13:14:54 GMT+0530 (India Standard Time)
నేడు విశాఖలో నేవీ వేడుకలు..చంద్రబాబు ముఖ్య అతిధిగా
నేడు విశాఖ లో నేవీ వేడుకలు జరగనున్నాయి. ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు

నేడు విశాఖ లో నేవీ వేడుకలు జరగనున్నాయి. నేవీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. విశాఖలోని ఆర్కే బీచ్ లో ఈ నేవీ వేడుకలు జరుగుతాయి. ఈ నేవీ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన నేరుగా తన సతీమణి భువనేశ్వరితో కలసి విశాఖకు రానున్నారు.
సాయంత్రం విశాఖకు...
చంద్రబాబు దంపతులు నేవీ డే వేడుకలను వీక్షించనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు చంద్రబాబు దంపతులు విశాఖకు చేరుకుంటారు. నేరుగా ఆర్కేబీచ్ కు చేరుకుని నేవీ వేడుకలను తిలకించనున్నారు. ఇప్పటికే ఆర్కే బీచ్ లో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. సందర్శకుల కోసం కూడా ఆర్కే బీచ్ లో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

