Sat Apr 11 2026 13:19:15 GMT+0530 (India Standard Time)
నేడు విశాఖలో మంత్రుల కమిటీ సమావేశం
విశాఖలో నేడు మంత్రుల కమిటీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు

విశాఖలో నేడు మంత్రుల కమిటీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సింహాచలం చందనోత్సవంపై చర్చ జరపనున్నారు. గత ఏడాది సింహాచలం అప్పన్న ఆలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి దాదాపు ఆరుగురు మరణించడంతో ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
సింహాచలం చందనోత్సవంపై ...
అధికారులు క్యూ లైన్ల ఏర్పాట్లతో పాటు అన్ని విషయాలలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకంటూ భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించనున్నారు. అలాగే భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సింహాచలం అప్పన్న చందనోత్సవానికి నేటి నుంచి ఆన్లైన్లో టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా సింహాచలంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

