Fri Dec 05 2025 13:03:38 GMT+0000 (Coordinated Universal Time)
Visakha : కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ విశాఖలో ఎప్పటి నుంచో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. విశాఖలో నూతన ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ ఎక్స్ లో ట్వీట్ చేసింది

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. విశాఖలో నూతన ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ ఎక్స్ లో ట్వీట్ చేసింది.విశాఖ కాపులుప్పాడలో ఇరవైరెండు ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు ట్వీట్ చేసింది కాగ్నిజెంట్. విశాఖలో ఈ ఐటీ క్యాంపస్ ఏర్పాటుతో సుమారు ఎనిమిది వేలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ట్వీట్లో కాగ్నిజెంట్ వెల్లడించింది.
ఎనిమిది వేల మందికి...
ఏఐ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ రంగంలో ఉద్యోగాలు లభిస్తాయని కాగ్నిజెంట్ వెల్లడించింది. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని కాగ్నిజెంట్ సంస్థ పరకటించింది. 2029 నాటికి ఐటీ క్యాంపస్ తొలిదశ పూర్తిచేస్తామన్న కాగ్నిజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు కాగ్నిజెంట్ సీఈవో కృతజ్ఞతలు తెలిపింది
Next Story

