Sat Dec 07 2024 21:19:44 GMT+0000 (Coordinated Universal Time)
Visakha : విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఆందోళనకు దిగిన కార్మికులు.. కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు?
విశాఖ స్టీల్ ప్లాంట్ లో నాలుగువేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. దీంతో కార్మిక సంఘలు ఆందోళనకు దిగాయి
విశాఖ స్టీల్ ప్లాంట్ లో నాలుగువేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేస్తామని ఒకవైపు చెబుతూనే మరొక వైపు కాంట్రాక్టు కార్మికులను తొలగించడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయడానికే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుందని కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే ఉత్పత్తి తగ్గిపోయినందుకు కార్మికుల సంఖ్యను తగ్గిస్తున్నామని చెబుతున్న యాజమాన్యం ప్రయివేటీకరణ దిశగా ప్రయత్నాలు చేస్తుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈరోజు ట్రైనింగ్ సెంటర్ వద్ద కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి.
మ్యాన్ పవర్ తగ్గించి...
మ్యాన్ పవర్ ను తగ్గించడంపై విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటి ఆందోళనకు దిగింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం కూడా వివాదంగా మారింది. కేంద్ర ప్రభుత్వం మోసపూరిత విధానాలను అవలంబిస్తుందని కార్మికసంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకకరణ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుందని కార్మిక సంఘాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకలా, కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలి మరొకలా ఉందంటూ కార్మిక సంఘలు ఆరోపిస్తున్నాయి. అయితే సెయిల్ లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను విలీనం చేస్తామంటూ లీకులు కూడా భారీగానే ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం చర్యలు...
కానీ కొందరు ఉద్యోగులను వేరే ప్రాంతాలకు బదిలీ చేయడంతో పాటు కాంట్రాక్టు కార్మికులను నాలుగువేల మందిని తొలగించడంపై కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ దిశగానే కేంద్ర ప్రభుత్వం చర్యలున్నట్లు తమకు అర్థమవుతుందని కార్మికసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అదే జరిగితే తాము ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి. ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కొద్దిసేపటి క్రితం కార్మిక సంఘాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Next Story