Mon Feb 16 2026 15:50:01 GMT+0530 (India Standard Time)
విశాఖ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
విశాఖపట్నంలోని క్రికెట్ స్టేడియం మరోసారి క్రికెట్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అందేటట్లు కనిపిస్తుంది

విశాఖపట్నంలోని క్రికెట్ స్టేడియం మరోసారి క్రికెట్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించనుంది. ఈ ఏడాది ఐపీఎల్ విశాఖ వేదికగా జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కనీసం రెండు మ్యాచ్ లు విశాఖలోని స్టేడియంలో జరిగేలా ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేసిన వినతికి బీసీసీఐ సానుకూలంగా స్పందించిందన్న వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీ కాపిటల్స్ జట్టు...
IPL-2026లో విశాఖ వేదిక ఉండనున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్టేడియంలో కనీసం రెండు మ్యా చ్ లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వేదికను హోం గ్రౌండ్ గా ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే.ఈ వేదిక ఢిల్లీ కాపిటల్స్ కు కలిసి రాగా ఈ ఏడాది కూడా మ్యాచ్ ల నిర్వహణకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయమై ఆంధ్ర క్రికెట్ సంఘం సంప్రదించగా ఢిల్లీ కాపిటల్స్ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.
Next Story

