Thu Mar 19 2026 08:50:05 GMT+0530 (India Standard Time)
మూడు రాష్ట్రాల రహదారి అందుబాటులోకి వస్తే?
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ మధ్య ఆరులేన్ల రహదారి నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి

ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ మధ్య ఆరులేన్ల రహదారి నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. మొత్తం గ్రీన్ఫీల్డ్ రహదారిగా నిర్మాణం చేపట్టారు. త్వరలోనే రహదారి అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు. ఈ రహదారిపై రాకపోకలు ప్రారంభమైతే ఉత్తరాంధ్ర ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తరాంధ్ర కు గేమ్ ఛేంజర్ గా...
ఈ రహదారి ఆంధ్రప్రదేశ్ లో వంద కిలోమీటర్ల మేరకు వెళుతుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఆరంభమమవుతుంది. దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో ఈ గ్రీన్ ఫీల్డ్ నిర్మాణం చేపట్టారు. పూర్తయ్యే దశలో ఉన్న ఈ రహదారి అందుబాటులోకి వస్తే మూడు రాష్ట్రాల్లో రాకపోకలు కూడా సులువుగా మారతాయని, ఎగుమతులు పెరుగుతాయని తెలిపింది.
Next Story

