Fri Dec 05 2025 16:34:56 GMT+0000 (Coordinated Universal Time)
యోగాను క్రీడల్లో భాగంగా చేయాలి : చంద్రబాబు
యోగాతో శారీరకంగానే కాదు మానసికంగా ఆరోగ్యం లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

యోగాతో శారీరకంగానే కాదు మానసికంగా ఆరోగ్యం లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు . విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. విశాఖలో నేడు యోగాంధ్రను నిర్వహించి రికార్డు సృష్టించబోతున్నామని తెిపారు. 1.44 లక్షల మంది యోగా శిక్షకులు ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.నిన్న ఇరవై రెండు వేల మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నీస్ రికార్డును సృష్టించారని చంద్రబాబు తెలిపారు.
రోజుకు గంట సేపు యోగా చేస్తే...
ప్రతి రోజూ గంట సేపు యోగా చేయగలిగితే ఆరోగ్యంగా ఉంటామని, శరీరంలో మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని, యోగా వల్ల వ్యక్తి జీవితంలో క్రమశిక్షణ అలవరుతుందని, అదే సమయంలో ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో నిర్వహించుకుంటున్నారని, యోగాను క్రీడల్లో భాగం చేయాలని, సర్ణాంధ్ర 2047 సాధనలో భాగంగా యోగాకు ప్రాధాన్యం కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు.
Next Story

