Wed Mar 18 2026 20:03:03 GMT+0530 (India Standard Time)
విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు కేబినెట్ సబ్ కమిటీ
8వ తేదీన విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయాలని చంద్రబాబు నిర్ణయించారు

ఈ నెల 8వ తేదీన విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రధాని రోడ్‌షో కూడా నిర్వహించే నేపథ్యంలో దాన్ని విజయవంతం చేయాలని మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు తెలిపారు. విశాఖలో ప్రధాని మోదీ ఎన్టీటీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక నోడ్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
రోడ్ షోను విజయవంతం చేసేలా...
ప్రధాని మోదీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు రోడ్ షో నిర్వహించనున్నారు. విశాఖ సిద్ధి వినాయక ఆలయం నుంచి సభ వేదిక వరకూ జరిగే రోడ్‌షో కోసం కూటమిలోని మూడు పార్టీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా మంత్రులందరూ ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

