Mon Mar 23 2026 19:49:19 GMT+0530 (India Standard Time)
Chandrababu : స్పీడ్ ఆఫ్ బిజినెస్ వైపు ఏపీ దూసుకెళుతుంది
స్పీడ్ ఆఫ్ బిజినెస్ వైపు ఏపీ వైపు వెళుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్ వైపు ఏపీ వైపు వెళుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికంగా ఏపీని దేశంలోనే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం సమ పాళ్లలో తీసుకెళుతున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు రుణపడి ఉంటామని చంద్రబాబు చెప్పారు.
అతి పెద్ద స్టీల్ ప్లాంట్ గా...
ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్ రాకతో ఇక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. సుపరిపాలన దిశగా తమ ప్రభుత్వం వెళుతుందని అన్నారు. టూరిజం, తీరప్రాంతం, ఐటీ పరిశ్రమలు వంటి వాటితో విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే బాధ్యత అని చంద్రబాబు తెలిపారు. స్టీల్ సిటీగా మారి దేశంలోనే అతిపెద్ద స్టీల్ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటవుతుందని చంద్రబాబు చెప్పారు. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సీజన్ లోనే పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని విశాఖకు తీసుకు వస్తామని చంద్రబాబు తెలిపారు. విశాఖ, అమరావతి, తిరుపతి పట్టణాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు.
Next Story

