Wed Jan 28 2026 23:50:56 GMT+0000 (Coordinated Universal Time)
చేపలవేటపై యోగా డే వేడుకల ఎఫెక్ట్
విశాఖలో యోగా డే వేడుకలకు భారీగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

విశాఖలో యోగా డే వేడుకలకు భారీగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. విశాఖలోనే మంత్రుల బృందం ఉండి యోగా డే ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. ఆర్కే బీచ్రోడ్లో ప్రధాన వేదిక నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఒకవేళ వర్షం పడితే ఏయూ గ్రౌండ్స్ లో యోగా వేడుకలను నిర్వహించాలని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
రెండు రోజుల్లో నిషేధం...
ఏయూలో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేశారు. 25 వేల మంది గిరిజన విద్యార్థులతో సూర్యనమస్కారాలు చేయించనున్నారు. అయితే ప్రధాని వస్తుండటంతో పాటు ఈ నెల 20, 21వ తేదీల్లో విశాఖలోనే ప్రధాని మోదీ ఉంటుండటంతో చేపల వేటపై ఆంక్షలను విధించారు. ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు చేపలవేటపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు.
Next Story

