Fri Dec 05 2025 13:44:00 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్షకు దిగారు

విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరంలో కార్మికుల సమ్మెకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆమరణ నిరహార దీక్షకు దిగారు. స్టీల్ ప్లాంట్ లో తొలగించిన రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజుల నుంచి విశాఖలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా...
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆమరణ దీక్షకు దిగడంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. షర్మిలా రెడ్డి ఆమరణ దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు పలికిన స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆమెను స్వాగతించారు.
Next Story

