Fri Dec 05 2025 14:13:49 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : రెండోరోజు విశాఖలో నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విశాఖలో రెండో రోజు పర్యటిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విశాఖలో రెండో రోజు పర్యటిస్తున్నారు. తన రెండో రోజు పర్యటనలో సోమవారం ఉదయం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకం నుంచి మంత్రి నారా లోకేష్ అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వివిధ అర్జీలను...
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా రెగ్యులరైజేషన్ కాకుండా ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలను కేవలం డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్ధతిలో మాత్రమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ సమాఖ్య ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య పట్ల లోకేశ్ సానుకూలంగా స్పందించారు. వీటితో పాటు వ్యక్తిగత సమస్యలను అనేక మంది అర్జీల రూపంలో సమర్పించారు.
Next Story

