Thu Mar 27 2025 04:07:22 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ పై కీలక ఉత్తర్వులు
గత ప్రభుత్వ హాయంలో జరిగిన రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

గత ప్రభుత్వ హాయంలో జరిగిన రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అభియోగాలునమోదైన అధికారులను విచారించాలని ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో గత వైసీపీ హయాంలో అనేక భూములు ట్యాంపరింగ్ చేసి ఆక్రమించారని ఎన్నికలకు ముందు కూటమి పార్టీ నేతలు ఆరోపించారు.
నలుగురు డిప్యూటీ కలెక్టర్లు...
దీంతో నలుగురు డిప్యూటీ కలెక్టర్లు సహా ఏడుగురు అధికారులకు జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 22న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కొమ్మాది, ఎండాడలో రెవెన్యూ రికార్డుల ట్యాంపిరింగ్ పెద్దయెత్తున జరిగిందని ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో మరోసారి విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
Next Story