Fri Dec 05 2025 09:26:48 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు విశాఖకు చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో ఆయన పాల్గొంటారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో ఆయన పాల్గొంటారు. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ లో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. వికసిత్ భారత్ లో భాగంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్రి స్టాక్ వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో...
ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ లు కూడా పాల్గొంటారు. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 9.30 గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. అనంతరం జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో పాల్గొని తిరిగి అమరావతిలోని అసెంబ్లీకి చేరుకుంటారు.
Next Story

