Wed Jan 14 2026 17:07:31 GMT+0000 (Coordinated Universal Time)
ఏలూరు ఘటనపై జగన్ ఆరా
ఏలూరు ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనానితో జగన్ ఫోన్ లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం [more]
ఏలూరు ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనానితో జగన్ ఫోన్ లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం [more]

ఏలూరు ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనానితో జగన్ ఫోన్ లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని జగన్ నానిని ఆదేశించారు. ఏలూరుకు ప్రత్యేక వైద్య బృందాలను పంపుతున్నట్లు జగన్ నానికి వివరించారు. ఏలూరు పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్నారులు ఫిట్స్ లాగా రావడంతో ఇబ్బందులు పడ్డారు. నోటి నుంచి నురగలు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరికి ప్రత్యేక వైద్యాన్ని అందేలా ఏర్పాట్లు చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ తెలిపారు.
Next Story