Mon Jan 20 2025 09:35:24 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
![Telugupost, telugunews, latest top 10 telugu news, top 10 latest news, telugu news Telugupost, telugunews, latest top 10 telugu news, top 10 latest news, telugu news](https://www.telugupost.com/h-upload/2023/11/18/1561554-18-11-23-2.webp)
ACB : ఏసీబీ సోదాల్లో కోట్ల ఆస్తులు ... ఉద్యోగి ఇంట్లో బంగారం, వెండి
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు ఏసీబీ దాడుల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. ఎంవీఐగా పనిచేస్తున్న రమేష్ బాబు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కాకినాడ జిల్లా బెండపూడి చెక్‌పోస్టులో ఆయన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని ఏసీబీ సోదాల్లో వెల్లడయింది. ఆయనకు 4.05 కోట్ల స్థిరాస్థులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.Komatreddy: ఓసారి ఓటమి.. ఈసారి గెలుపునకు అవకాశాలున్నాయా?
కోమటిరెడ్డి బ్రదర్స్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఇద్దరూ ఒకసారి ఓటమి చవి చూశారు. 2018 సాధారణ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి పాలయి ఆ తర్వాత భువనగిరి పార్లమెంటుకు పోటీ చేసి ఎన్నికయ్యారు. అలాగే ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆయన మునుగోడు నుంచి పోటీ చేసి గెలిచినా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నికలు వచ్చాయి.KTR : ఓల్డ్ సిటీ బిర్యానీ కోసం కేటీఆర్.. అర్థరాత్రి
మంత్రి కేటీఆర్ ఎన్నికల వేళ ప్రచారమే కాదు.. సోషల్ మీడియాలోనూ ముందుండటానికి ప్రయత్నిస్తుంటారు. విన్నూత్న తరహాలో ప్రజలను కలుస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నాటు కోడి కూర వండి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అయితే తాజాగా నిరన రాత్రి హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకి వెళ్లిన కేటీఆర్ అక్కడ హోటల్ లో బిర్యానీ, చాయ్ తాగి అక్కడున్న వారిని ఆశ్చర్యపర్చారు.ఫ్యాక్ట్ చెక్: చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అర్ధరాత్రి సమయంలో భేటీ అయ్యారంటూ వెలువడిన దిశా ఈపేపర్ కథనం ఫేక్
తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ వంటి పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలపై 2023 సెప్టెంబర్‌లో అరెస్టు అయ్యి.. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఆపై కొన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందేందుకు మధ్యంతర బెయిల్ పొందగలిగారు. బెయిల్ తర్వాత రేవంత్‌రెడ్డి వంటి నేతలు ఆయనను అర్ధరాత్రి కలిశారని వార్తలు వచ్చాయి.Unstoppable : అన్‌స్టాపబుల్ షోలో రష్మికకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ..
బాలయ్య అన్‌స్టాపబుల్ షో మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఆహాలో ప్రసారమవుతున్న ఈ షో.. ఇప్పటికే రెండు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్ తో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ సీజన్ ని ఒక స్పెషల్ ఎపిసోడ్ తో మొదలు పెట్టారు. ఆ ఎపిసోడ్ లో 'భగవంత్ కేసరి' మూవీ టీం సందడి చేసింది. ఇక తరువాత ఎపిసోడ్ లో బాలీవుడ్ స్టార్ ని బాలయ్య తీసుకు వస్తున్నారు.Mahesh Babu : ఇది గమనించారా.. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లెటర్స్ అన్ని వాడేసిన మహేష్..
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో కంటే కమర్షియల్ యాడ్స్ తోనే ఆడియన్స్ ని ఎక్కువగా పలకరిస్తారు. ఇండియన్ ఫిలిం స్టార్స్ ఏ హీరో కూడా చేయనన్ని యాడ్స్ మహేష్ చేసి ఉంటారు అనడంలో పెద్ద సందేహం పడనవసరం లేదనుకుంటా. అయితే ఈ యాడ్స్ నుంచి వచ్చే సంపాదనని కూడా మహేష్ మంచి పనులకే ఉపయోగిస్తుంటారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పిల్లల వైద్యానికి, పేద ప్రజల విద్యకు, మరికొన్ని సోషల్ కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు.Rekha Boj : ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా పరిగెడతానంటున్న హీరోయిన్..
ప్రస్తుతం దేశంలో వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ నడుస్తుంది. సెమీస్ లో న్యూజిలాండ్ పై గెలిచి ఫైనల్ కి చేరుకున్న భారత్.. ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ కి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. లాస్ట్ టైం మిస్ అయిన వరల్డ్ కప్ ట్రోఫీ.. ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రతి ఇండియన్ కోరుకుంటున్నారు. ఇక ఈ వరల్డ్ కప్ లో ఆడిన ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వస్తున్న భారత్ టీం ఫైనల్ కూడా గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.Pawan, Tdp : ఏమయ్యా పవనూ.. ఇప్పుడైనా నిలదీయకపోతే ఎలాగయ్యా?
రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు అవుతుంది. అయితే రెండుచోట్ల ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఎవరి పాలన వారిది. ఎవరి అధికారం వారిది. కానీ జాతీయ పార్టీలు రెండు చోట్ల కాలు మోపేందుకు సిద్ధమవుతున్నాయి. ఎవరిదీ తప్పు కాదు. అధికారం కోసం ఎవరైనా ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. పొత్తులు మాత్రమే. ప్రధానంగా ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది.Amit Shah : బీఆర్ఎస్ టైం అయిపోయింది... బీజేపీ సమయం వచ్చింది
ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. గద్వాల బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ టైం అయిపోయిందని, బీజేపీ వచ్చే సమయం ఆసన్నమయిందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని అమిత్ షా అన్నారు. అబద్ధపు మాటలతో ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. బీజేపీకి ఓటేస్తే సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని అమిత్ షా అన్నారు. అందుకు ప్రజలు కూడా మద్దతు పలకాలని కోరారు.చంద్రబాబు ‘సంతకం’ మిస్సింగ్!
స్కిల్ డెవలప్మెంట్ స్కాంకి సంబంధించిన ఫైళ్లలో చంద్రబాబు ఎక్కడా సంతకం చేయలేదని తెలుగుదేశం నాయకులు వాదిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో 13 చోట్ల ఆయన ‘స్కిల్’ ఫైల్స్‌పై సంతకం చేశారని సీఐడీ అధికారులు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. ఈ సంగతి ఎలా ఉన్నా, సంక్షేమ పథంలో తెలుగు రాష్ట్రాలో చంద్రబాబు సంతకం మిస్సయింది. ఆ ప్రభావం ప్రతీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీపై కనిపిస్తోంది.Next Story