Thu Jan 23 2025 10:50:04 GMT+0000 (Coordinated Universal Time)
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
![Telugupost, telugunews, latest top 10 telugu news, top 10 latest news, telugu news Telugupost, telugunews, latest top 10 telugu news, top 10 latest news, telugu news](https://www.telugupost.com/h-upload/2023/11/17/1561246-17-11-23-1.webp)
World Cup Finals 2023 : చావుదెబ్బతీయండి.. ప్రతీకారం తీర్చుకోండి.. ఇంతకు మించిన టైం ఏముంటుంది?
ఆదివారం అహ్మదాబాద్ లో టీం ఇండియాతో వరల్డ్ కప్ ఫైనల్స్ లో తలపడే టీం ఎవరూ తేలిపోయింది. ఆస్ట్రేలియాతో అమీతుమీకి భారత్ సిద్ధమవుతుంది. వరల్డ్ కప్‌లో ఈసారి ఊహించనవి అన్నీ జరుగుతున్నాయి. లీగ్ మ్యాచ్‌లు ప్రారంభమైన తొలినాళ్లలో పేలవ ప్రదర్శన చూపిన జట్లు పుంజుకున్నాయి.ys jagan : కేసీఆర్ బెటర్ గా ఉన్నారా.. జగన్‌లో ఆ బెదురెందుకు?
రాష్ట్ర విభజన జరిగినా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై పోలిక సహజంగానే ఉంటుంది. రాష్ట్రాలుగా విడిపోయినా ఒకే భాష మాట్లాడుతూ, నిన్నటి వరకూ కలసి ఉన్న ప్రజలు కావడంతో సహజంగా ఒక రాష్ట్రంపై మరొకరికి ఆసక్తి ఉంటుంది.YSRCP : టీడీపీపై ఫైర్ అయిన విజయసాయిరెడ్డి
తెలంగాణ ఎన్నికలలో టీడీపీ వ్యవహార శైలిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండి పడ్డారు. ఆయన ట్వీట్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీలలో పచ్చ కండువాలు స్వైర విహారం చేస్తున్నాయంటే టోటల్ డ్రామాస్ పార్టీ (TDP) ఎటువంటి అపవిత్ర పొత్తులకైనా తెగించిందని అర్థమని చెప్పాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారుYs Jagan : చంద్రబాబు మూడుసార్లు గెలిచింది ఇలాగే.. స్కీమ్ ల వల్ల కాదు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా దోపిడీయేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అసైన్డ్ భూముల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. నూజివీడులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భూములపై హక్కులను కల్పిస్తూ అందరికీ పట్టాలను అందచేశారు.కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్లడం ఖాయం...మ్యానిఫేస్టో విడుదల కార్యక్రమంలో ఖర్గే
తెలంగాణ ఎన్నికల మ్యానిఫేస్టో విడుదలయింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మ్యానిఫేస్టోను విడుదల చేశారు. మొత్తం 42 పేజీలతో ఈ మ్యానిఫేస్టో ను విడుదల చేశారు. అభయ హస్తం పేరుతో మ్యానిఫేస్టోను మల్లికార్జున ఖర్గే జనం ముందుంచారు. మొత్తం 62 అంశాలతో మ్యానిఫేస్టోను విడుదల చేశారు.కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి
సినీనటి, బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఖర్గే విజయశాంతిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో విజయశాంతి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.కేసీఆర్ కరీంనగర్లో అంత సేపు మాట్లాడారా? కారణం తెలుసా?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే ప్రజా ఆశీర్వాద సభల పేరిట నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. గత నెల 15వ తేదీన ఆయన తెలంగాణలో ప్రచారాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన కేసీఆర్ తర్వాత పది రోజులకే అందరికంటే ముందుగా మ్యానిఫేస్టోను కూడా విడుదల చేశారు.Congress : అభయ హస్తం .. అందరికీ .. మ్యానిఫేస్టో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
తెలంగాణ మ్యానిఫేస్టోలో కీలక అంశాలను ప్రస్తావించింది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా మ్యానిఫేస్టోకు రూపకల్పన చేశారు. ప్రధానంగా రైతులు, యువత, నిరుద్యోగులు, మహిళలే లక్ష్యంగా మ్యానిఫేస్టోను రూపొందిచారు. జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని ప్రకటించింది.RBI: యాక్సిస్ బ్యాంకుపై రూ.90 లక్షల జరిమానా!
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్‌పై భారీ చర్యలు తీసుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకుపై రూ.90.92 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఆర్బీఐ రూపొందించిన నిబంధనలను పాటించనందున యాక్సిస్ బ్యాంక్‌పై ఈ చర్య తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.Rahul Gandhi : దోచుకున్నది కక్కిస్తాం.. ప్రజల అకౌంట్లో వేసేస్తాం
పదేళ్లు తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, కాంగ్రెస్ తుపానులో ఈసారి కొట్టుకుపోక తప్పదని రాహుల్ గాంధీ అన్నారు. పినపాకలో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. పదేళ్లు దోచుకున్న పాలనకు అంతం పలికే రోజు వచ్చిందన్నారు.Next Story