Tue Jan 13 2026 07:07:45 GMT+0000 (Coordinated Universal Time)
ATM లు మొరాయింపు .. జనానికి కష్టాలే

మోడీ ప్రభుత్వం నల్లధనం కట్టడికి ఏదో కష్టపడుతున్నది కదా అని రెండు రోజులు చిల్లర డబ్బులకు నానా కష్టాలు పడిన ప్రజలు మూడో రోజు కూడా పరిస్థితిలో మార్పు లేకపోయేసరికి అసహనానికి గురవుతున్నారు. చిల్లర డబ్బుల గురించి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చినా సరే భరించిన ప్రజలు మూడో రోజు ఎటిఎం లు పని చేస్తాయి కదా, 500 కొత్త నోట్లు కూడా అందుబాటులోకి వస్తాయనే నమ్మకంతో ఉన్నారు. సర్కారు హామీ కూడా రెండు రోజులు ఎటిఎం లు బంద్ చేసిన వాళ్ళు అంతా చక్కబెడతారులే అని అనుకున్నారు. కానీ ఇప్పటి దాకా ఎటిఎం లు మొరాయిస్తూనే ఉండేసరికి ఆగ్రహిస్తున్నారు. ఇది అచ్ఛంగా ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడుతున్నారు.
Next Story

