Sat Dec 06 2025 16:14:20 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : అందరినీ తీసుకొస్తాం... కొంత సమయం పట్టొచ్చు
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయలును తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయలును తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సురక్షితంగా అందరినీ భారత్ కు చేరుస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. ఉక్రెయిన్ లో దాదాపు 20 వేల మంది భారతీయులు చిక్కుకున్నట్లు సమాచారం ఉందన్నారు. వారందరినీ విడతల వారీగా తరలించే ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు.
ఆలస్యమయినా....
ప్రస్తుతం అక్కడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో కొంత ఆలస్యమయినా సురక్షితంగా చేర్చేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న దేశాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సొంత ఖర్చులతోనే విద్యార్థులను ఇండియాకు తీసుకువస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
Next Story

