Thu Mar 19 2026 10:47:02 GMT+0530 (India Standard Time)
Ukraine Crisis : రష్యాకు ధీటుగా బదులిస్తున్న ఉక్రెయిన్
రష్యా దాడులకు ధీటుగా ఉక్రెయిన్ సమాధానం చెబుతోంది. ఉక్రెయిన్ రష్యాకు చెందిన రెండు ఫైట్ జెట్లను కూల్చి వేసింది.

రష్యా దాడులకు ధీటుగా ఉక్రెయిన్ సమాధానం చెబుతోంది. ఉక్రెయిన్ రష్యాకు చెందిన రెండు ఫైట్ జెట్లను కూల్చి వేసింది. ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు ఒడ్డి పోరాడుతున్నేారు. ఉక్రెయిన్ ఈస్టర్ ఫ్రంట్ దాడిలో రష్యా సైనికుల కాన్వాయ్ ధ్వంసమయింది. ఈ దాడిలో రష్యా సైనికులు కొందరు మృతి చెందినట్లు తెలుస్తోంది.
మృతుల సంఖ్య....
ఒంటరిగానైనా రష్యాకు ధీటుగా సమాధానం చెబుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. బాంబుల దాడితో ఉక్రెయిన్ ప్రజలు అండర్ గ్రౌండ్ రైల్వేస్టేషన్ లో తలదాచుకున్నారు. ఇప్పటికే 137 మంది సైనికులు, పౌరులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు రష్యా బలగాలు చేరుకున్నాయి. నగరాన్ని చుట్టుముట్టాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో గడుపుతున్నారు.
Next Story

