Thu Mar 19 2026 07:43:35 GMT+0530 (India Standard Time)
Ukraine war : రష్యాతో మాట్లాడండి... భారత్ కు ఉక్రెయిన్ విజ్ఞప్తి
రష్యా యుద్ధాన్ని ఆపాలని ఉక్రెయిన్ భారత్ ను కోరింది. రష్యా దాడులను నిలిపివేసేందుకు మధ్యవర్తిత్వం వహించాలని కోరింది.

తమ దేశంపై రష్యా యుద్ధాన్ని ఆపాలని ఉక్రెయిన్ భారత్ ను కోరింది. రష్యా దాడులను నిలిపివేసేందుకు మధ్యవర్తిత్వం వహించాలని కోరింది. రష్యాతో భారత్ కు ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా యుద్ధ నివారణకు భారత్ జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా భారత్ కు విజ్ఞప్తి చేశారు. భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్ని రష్యాపై వత్తిడి తేవాలని ఆయన కోరారు.
సంక్షోభం....
తమ దేశం ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తుల్లో భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుందని గుర్తు చేసింది. ఈ యుద్ధం కొనసాగితే దాని ప్రభావం ఆహారం ఉత్పత్తులపై పడుతుందని, అది తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని రష్యా ఆపేలా భారత్ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Next Story

