Thu Mar 19 2026 18:43:58 GMT+0530 (India Standard Time)
Ukraine War : రష్యా మేజర్ జనరల్ మృతి
తాజాగా ఉక్రెయిన్ సైన్యం జరిపిన కాల్పుల్లో రష్యాకు చెందిన మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్ చనిపోయారు.

రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఎందరినో బలితీసుకుంటుంది. సామాన్య పౌరుల నుంచి అధికారుల వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ పై రష్యా గత 13 రోజులుగా దాడులు చేస్తుంది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను ఆక్రమించే దిశగా రష్యా సైన్యం కదులుతుంది. దీంతో ప్రధాన నగరాలన్నీ బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. అయితే ఉక్రెయిన్ సైన్యంతో పాటు పౌరులు కూడా రష్యా సైన్యాన్ని ప్రతిఘటిస్తున్నారు.
ఖర్కివ్ కు సమీపంలో....
తాజాగా ఉక్రెయిన్ సైన్యం జరిపిన కాల్పుల్లో రష్యాకు చెందిన మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్ చనిపోయారు. ఆయన రష్యాకు చెందిన 41 బెటాలియలన్ కు అధిపతిగా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ కమాండర్ కూడా, ఖర్కివ్ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో రష్యా మేజర్ జనరల్ చనిపోయినట్లు ఉక్రెయిన్ ధృవీకరించింది.
Next Story

