Fri Dec 05 2025 08:14:38 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine War : యుద్ధం ఆగదు.. పుతిన్ కీలక వ్యాఖ్యలు
రష్యాలో మార్షల్ లా అవసరం లేదని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు. లక్ష్యం నెరవేరే వరకూ యుద్ధం ఆగదని చెప్పారు.

రష్యాలో మార్షల్ లా అవసరం లేదని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు. లక్ష్యం నెరవేరే వరకూ యుద్ధం ఆగదని చెప్పారు. ఎంతో ఆలోచించి యుద్ధానికి దిగామని చెప్పారు. శాంతి ఒప్పందాలను ఉక్రెయిన్ ఉల్లంఘించిందని పుతిన్ అన్నారు. మహిళ పైలట్లతో పుతిన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పుతిన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
నాటో దేశాలకు వార్నింగ్...
రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానమని చెప్పారు. ఉక్రెయిన్ పై సైనిక చర్య చాలా కఠినమైన నిర్ణయమని చెప్పారు. నాటో దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఊహించిన దానికంటే భీకర పోరు జరుగుతుందని చెప్పారు. ఉక్రెయిన్ లో అణ్యాయుధాలు లేకుండా చేస్తామని చెప్పారు.
- Tags
- putin
- ukriane war
Next Story

