Mon Mar 16 2026 15:14:03 GMT+0530 (India Standard Time)
కాల్పులకు ఆరు గంటల విరామం .. ప్రకటించిన రష్యా
ఖార్కివ్ లో ఆరు గంటల పాటు కాల్పులకు రష్యా విరామం ప్రకటించింది.

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులతో మరో విమానం బయలుదేరింది. 200 మందితో బయలుదేరిన ఈ విమానం ఈరోజు రాత్రి 1.30 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకుంటుంది. ఇప్పటికే ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. ఖార్కివ్ లో ఎక్కువ మంది భారతీయులు చిక్కుకుపోయి ఉన్నారు. దీంతో ఖార్కివ్ లో ఆరు గంటల పాటు కాల్పులకు రష్యా విరామం ప్రకటించింది.
సేఫ్ ప్యాకేజీ...
గత ఇరవై నాలుగు గంటల్లో 3,452 మంది భారతీయులను స్వదేశానికి తరలించామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. మరో పదిహేను విమానాలలో భారతీయులను తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. భారతీయ విద్యార్థులకు రష్యా సేఫ్ ప్యాకేజీని కల్పించడంతో విద్యార్థుల తరలింపు సులువగా మారనుంది.
Next Story

