Thu Mar 19 2026 18:43:08 GMT+0530 (India Standard Time)
Ukraine War : జెలెన్ స్కీకి మోదీ ఫోన్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో నేడు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో నేడు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. రష్యా యుద్ధం కొనసాగిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం 11 రోజుల నుంచి సాగుతోంది. ఇరుదేశాలు ఎవరికి వారు యుద్ధంలో తగ్గడం లేదు. వేలాది మంది సైనికులు, పౌరులు హతమయ్యారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి.
చర్చల నేపథ్యంలో.....
ఈరోజు రష్యా - ఉక్రెయిన్ ల మధ్య మూడో విడత చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి మోదీ ఫోన్ చేయనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. చర్చల్లో సానుకూలంగా వ్యవహరించాలని మోదీ సూచించనున్నారని తెలిసింది.
Next Story

