Mon Feb 02 2026 13:49:59 GMT+0000 (Coordinated Universal Time)
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మోదీ ఫోన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. భారతీయ విద్యార్థుల విషయంపై ఆయన చర్చించారు

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. భారతీయ విద్యార్థుల విషయంపై ఆయన చర్చించారు. రష్యా నుంచి భారతీయ విద్యార్థులను తరలించేందుకు సహకరించాల్సిందిగా మోదీ పుతిన్ ను కోరారు. విద్యార్థుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. దీనికి పుతిన్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలిసింది.
సుమీ పట్టణంలో....
ఉక్రెయిన్ లో వారం రోజులుగా యుద్ధం జరుగుతుంది. సరిహద్దు దేశాల నుంచి విద్యార్థులను తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం చేపట్టింది. అయితే భారతీయ విద్యార్థులు రష్యా సరిహద్దు సమీపంలోని సుమీ పట్టణంలో ఉన్నారని, అక్కడి నుంచి రష్యా సరిహద్దుకు చేరుకోవడానికి రెండు గంటలు మాత్రమే సమయం పడుతుందని, తమను రష్యా నుంచి భారత్ కు తరలించాలని విద్యార్థులు ఈరోజు భారత ప్రభుత్వాన్ని కోరారు. దీంతో మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేశారు.
Next Story

