Mon Mar 16 2026 05:10:47 GMT+0530 (India Standard Time)
Ukraine War : వేగంగా ఆపరేషన్ గంగ
ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయలు తరలింపు వేగవంతమయింది

ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయలు తరలింపు వేగవంతమయింది. రొమేనియా నుంచి మరో విమానం ఢీల్లీకి చేరుకుంది. ఈ విమానంలో 229 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఆపరేషన్ గంగా పేరిట చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుంది. ఉక్రెయిన్ లో దాదాపు ఇరవై వేల మంది భారతీయులు చిక్కుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.
నేడు మరో 14 విమానాలు....
వారిందరినీ తరలించే ప్రక్రియ వేగవంతం కానుంది. ఈరోజు మరో 11 పౌర, నాలుగు వాయు సేన విమానాలు ఇండియాకు ఉక్రెయిన్ నుంచి చేరుకోనున్నాయి. ఈ విమానాల్లో దాదాపు 2,200 మంది భారతీయులను తరలిస్తామని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వారు సరిహద్దు ప్రాంతాలకు రావాల్సిందిగా ఇప్పటికే భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Next Story

