Thu Jan 29 2026 05:59:25 GMT+0000 (Coordinated Universal Time)
Ukraine Crisis : ఉక్రెయిన్ లో 20 వేల మంది భారతీయులు
ఉక్రెయిన్ లో దాదాపు ఇరవై వేల మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు భారత విదేశాంగ తెలిపింది

ఉక్రెయిన్ లో దాదాపు ఇరవై వేల మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు భారత విదేశాంగ తెలిపింది. అయితే వీరంతా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. వీరిని భారత్ కు తీసుకురావాలంటే అక్కడ విమానాల రాకపోకలను అనుమతించాలని, అప్పుుడే అది సాధ్యమవుతుందని తెలిపింది. ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం నేడు రెండో రోజుకు చేరుకుంది. రాజధాని కీవ్ నగరానికి రష్యా సేనలు చేరుకున్నాయి.
అన్ని రకాలుగా....
ఈ నేపథ్యంలో భారతీయులను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్థన్ ప్రింగ్లా చెప్పారు. భారత పౌరుల భద్రత లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అక్కడ చిక్కుకున్న విద్యార్థులతో మాట్లాడుతూ వారి అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. పరిస్థితులు కొంత సద్దుమణిగిన వెంటనే భారత్ కు వారిని తీసుకువస్తామని చెప్పారు.
Next Story

