Mon Mar 16 2026 06:49:09 GMT+0530 (India Standard Time)
Ukraine War : బయలుదేరిన నాలుగో విమానం
ఉక్రెయిన్ నుంచి భారతీయులతో నాలుగో విమానం బయలుదేరింది.

ఉక్రెయిన్ నుంచి భారతీయులతో నాలుగో విమానం బయలుదేరింది. ఈ విమానంలో 198 మంది భారతీయులు ఉన్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్ లో యుద్ధం కొనసాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి భారతీయులను దేశానికి తరలిస్తుంది. సరిహద్దు దేశాల నుంచి భారతీయులను తీసుకు వస్తున్నారు.
ఇప్పటి వరకూ....
ఇప్పటి వరకూ 709 మంది భారతీయులు మూడు విమానాల్లో భారత్ కు చేరుకున్నారు. ఈరోజు వచ్చిన రెండో విమానంలో మొత్తం 240 మంది భారత్ కు చేరుకున్నారు. వీరిలో 39 మంది తెలుగు విద్యార్థులున్నారు. ఉక్రెయిన్ నుంచి వస్తున్న భారతీయుల్లో అధికంగా విద్యార్థులే ఉన్నారు. నాలుగో విమానం ఈరోజు రాత్రికి భారత్ కు చేరుకునే అవకాశముంది.
Next Story

