హోంగార్డులకు కేసీఆర్ సరప్రైజ్ గిఫ్ట్

తెలంగాణలో హోంగార్డ్స్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. హోమ్ గార్డ్స్ జీతాన్ని నెలకు ఇరవై వేల రూపాయలకు పంెచారు. రెగ్యులర్ కానిస్టేబుల్ తో సమానంగా వసతులు అలవెన్సులు కల్పిస్తామన్నారు. సంవత్సరానికి వెయ్యి రూపాయలు జీతం పెంచుతామని చెప్పారు. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో వీరికి రిజర్వేషన్ కూడా కల్పించారు. హోంగార్డులకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించనున్నారు. ఆసుపత్రుల్లో కానిస్టేబుల్స్ తో సమానంగా చికిత్స కల్పించనున్నారు. డైలీ అలవెన్సును రెండు వందలు చేశారు. ప్రతి ఏడాది వంద బందోబస్తు డ్యూటీలు వేయనున్నారు. పెంచిన జీతం వచ్చే జనవరి నెల నుంచి వర్తించనుంది. దేశంలో ఎక్కడా హోంగార్డులకు ఇంత జీతం ఇచ్చిన దాఖలాలు లేవు. పన్నెండు వేల నుంచి ఇరవైవేలకు పెంచడంతో హోంగార్డులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. కానిస్టేబుళ్లతో సమానంగా ప్రతి ఏడాది నాలుగు యూనిఫారంలు ఇవ్వనున్నారు. మహిళ హోంగార్డులకు ఆరు నెలల మెటర్నటీ సెలవు మంజూరు చేయనున్నారు. ట్రాఫిక్ డ్యూటీలు నిర్వహిస్తున్న హోంగార్డులకు 30 శాతం అదనపు వేతనంగా ఇవ్వనున్నారు.
- Tags
- హోంగార్డులు

