హోం అత్యుత్సహం.... చినబాబు ఆగ్రహం ...!! ?

చినబాబు అంటే ఎవరు భావి తెలుగుదేశం అధినేత. ఈ మాత్రం క్లారిటీ సామాన్య కార్యకర్త నుంచి బడా లీడర్ వరకు ఎట్లను వుంది కదా. అందుకే లోకేష్ టూర్ లో ఎవరికివారే ఆయన్ను ఆకర్షించే పనిలో పడ్డారు. ఆయన కంట పడితే మహాభాగ్యంగా పరితపించారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటనకు వచ్చిన లోకేష్ ను హోం మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దగ్గరుండి లీడ్ చేశారు. లోకేష్ ఎవరిని కలవాలన్నా డిసైడ్ చేసేది రాజప్పే.
అలిగి వెళ్లిపోయిన రెడ్డి సుబ్రహ్మణ్యం ...
ఇది శాసన మండలి డిప్యూటీ ఛైర్మెన్ రెడ్డి సుబ్రమణ్యానికి ఆగ్రహం కలిగించింది. తమ ప్రియతమ నేతను కలవాలనుకుంటే పోలీసులతో రాజప్ప అడ్డుకుంటున్నారని గ్రహించి లోకేష్ కాకినాడ కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వెనక్కి వెళ్లారు. ఆలస్యంగా విషయం మంత్రి నారా లోకేష్ కి చేరింది. వెంటనే స్పందించిన చినబాబు స్వయంగా రెడ్డి సుబ్రమణ్యంతో మాట్లాడి విషయాన్ని కూల్ చేశారు. తన వాహనంలో పక్కన కూర్చో పెట్టుకు మరీ ఆయన్ను బుజ్జగించారు. పనిలో పని రాజప్పకు చిన్న మందలింపు అయిపొయింది. ఇది తూర్పు గోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
- Tags
- లోకేష్

