Fri Apr 10 2026 05:01:40 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో టీఆర్ఎస్ నేత దారుణ హత్య

టీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు ఆయనను బండరాళ్లతో కొట్టి చంపారు. కొద్దిసేపటి క్రితం సనత్ నగర్ బస్టాండ్ లో ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్ లో ఈ హత్య సంచలనం రేకెత్తించింది. వల్లభనేని శ్రీనివాసరావు టీఆర్ఎస్ నేత. ఆయనకు, స్థానిక టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రత్యర్థులు బండరాళ్లతో కొట్టి చంపారని పోలీసులు చెబుతున్నారు. డాగ్ స్వ్కాడ్ ను రప్పించి నిందితుల ఆచూకి కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
- Tags
- టీఆర్ఎస్
Next Story

