హైదరాబాద్ లో చడ్డీ గ్యాంగ్ ఎంటర్ అయింది....!

కూకట్ పల్లి , నిజాం పేట్ ఏరియాలో చడ్డీ గ్యాంగ్ దొంగలు మాటు వేశారు..దండు పాళ్యం సినిమా తరహాలో చొరీలు చేస్తారు. తాజా ఖాకీ సినిమా తరహాలో చొరీ లు చేసి హాత్యలు చేస్తారు. హైదరబాద్ నగరంలో తిష్ట వేసిన చడ్డీ గ్యాంగ్.. హైవేల పక్కన వున్న ఇండ్ల ను టార్గెట్ చేస్తుంది ఈ చడ్డీ గ్యాంగ్. ఇప్పడు ఈ చడ్డీ గ్యాంగ్ లను పట్టుకొవడానికి పోలీసులు పది బృందాలను రంగంలోకి దింపారు. సినిమా తరహాలు చొరీ చేయడంలో వారు ఆరి తెరారు. దొంగలు చేయడంలో వారిని మించిన వారు లేరు. ఈ దొంగల పేరు చెబితేనే పోలీసులు సైతం హాడలి పొతుంటారు. ఈ దొంగలు సిటిలోకి వచ్చారని సమాచారం వచ్చిన వెంటనే పోలీసులకు కంటి మీద కునుకు వుండదు. ఇప్పడు అలాంటి గ్యాంగ్ హైదరబాద్ సిటిలోకి ఎంటర్ అయ్యింది.. దానిపేరే చడ్డీ గ్యాంగ్. ఈ గ్యాంగ్ సంపన్నులు ఇండ్లనే టార్గెట్ చేసుకుంటుంది. పోలీస్ పరిబాషలో చడ్డీ గ్యాంగ్. ఈ చడ్డీ గ్యాంగ్ అంటేనే పోలీసులు ఉలిక్కి పడి పొతుంటారు. ఎందుకంటే.. వీరు చేసే దారుణాలు అతి క్రూరంగా వుంటాయి. అవి ఎలాగంటే దొంగతనానికి వచ్చి దోచుకుంటారు. ఆడవారి మాన ప్రాణాలను తీస్తారు. అడ్డువచ్చిన వారిని లేపేస్తారు. ఇది చడ్డీ గ్యాంగ్ తీరు.. గతంలో పోలీసులు అరెస్టు చేసి కటాకటాల వెనక్కి నెట్టినా కూడా తిరిగి బయటికి వచ్చి దొంగతనాలు చేస్తునే వుంటారు.
హైవే పక్కన ఇళ్లలోనే.....
ముఖ్యంగా హైవే ప్రక్కనే వుంటే ఇండ్లను వీరు టార్గెట్ చేస్తుంటారు. నేషనల్ హైవేలకు పక్కనే వున్న గేటెడ్ కమ్యూనిటిలతో పాటుగా నిర్మానుష్యంగా వుండే ఇండ్లను వీరు ఎంచుకుంటారు. సరిగ్గా తెల్లవారు జామున మూడు నుంచి నాలుగు గంటల మధ్యలోనే వీరు చోరీలు చేస్తుంటారు. ఈ టైమ్ లో ఇంటిలోకి ప్రవేశిస్తారు. వచ్చిన వెంటనే బీరువాలను తెరుస్తారు.తరువాత పడుకున్న వారి వంటి పైన వున్న నగలను వలుస్తారు.. ఈ టైమ్ లో ప్రతిఘటించిన వారిపైన దాడి చేస్తారు. మహిళలు నచ్చితే అత్యాచారం చేసి చంపుతారు.. అమ్మాయిలను వదిలి పెట్టరు. ఇలా దోచుకుని వీరు ఎంచక్కా హైవేలపై మరొక ప్రాంతానికి వెళ్లిపోతారు.
పది బృందాలు ఏర్పాటు....
అలాంటి చడ్డీ గ్యాంగ్ ఇప్పడు హైదరబాద్ నగరంలో ఎంట్రీ ఇచ్చింది. నిజాం పేట్ ప్రాంతంలో వీరు ఒక ఇంటిలో చొరీ చేశారు. ఐటి ఉద్యొగి ఇంటిలో చొరీ చేసి వెళ్లిపొయారు.అయితే అక్కడ వున్న సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించినప్పడు చడ్డీ గ్యాంగ్ ఎంట్రీ అయిన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే సిటి మొత్తాన్ని అప్రమత్తం చేశారు పోలీసులు.ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక బోర్డర్ లో వీరు నివాసం వుంటారు. గతంలో కూడా మొయినాబాద్ పరిధిలో ఒక ఫామ్ హౌజ్ లో చోరి చేసి వెళ్లిపొతూ అక్కడ వున్న ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేసి చంపారు ఈ దుండగులు. ఇప్పడు వీరు ఎలాంటి అకృత్యాలకు పాల్పడుతారోనన్న ఆందోళన పోలీసుల్లో వ్యక్తమవుతోంది. ఈ దొంగలను పట్టుకొవడానికి ఇప్పటికే పది బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నారు.
- Tags
- చడ్డీ గ్యాంగ్

