హైదరాబాద్ పోలీసుల దందా చూశారా?

హైదరబాద్ పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అధికారులు వ్యవహారిస్తున్నారు..పోలీస్ బాస్ డిజిపిగా పదోన్నతి పొందిన తరువాత సిటీ పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా కనబడుతుంది. ఎందుకంటే సిటీలోని ఒక పోలీస్ స్టేషన్ల్ లో పెద్ద మొత్తంలో ల్యాండ్ సెటిల్ మెంట్లు జరిగినట్లుగా ఆరొపణలు వస్తున్నాయి. దీనికి తోడు పోలీసుల కస్టడిలో వున్న ఒక నిందితుడు సెల్ఫీ వీడియో ఇప్పడు సంచలనం కలిగిస్తుంది,. తనను మూడురోజులు పోలీసులు నిర్భంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ ఒక వీడియో రికార్డు చేసి ఏకంగా తన తల్లికే వాట్సాప్ ద్వారా పంపించాడు,, ఇప్పడు ఈ వీడియో వైరల్ గా మారింది. అంతేగాకుండా ఈ వీడియో తో పాటుగా సంఘటనపైనా ఇప్పడు పోలీసుల దర్యాప్తు ప్రారంభం అయ్యింది.
తన్ను సెల్ఫీ వీడియో....
బోరబండ వుండే రౌడీషీటర్ తన్నుకు ఒక ల్యాండ్ సెటిల్ మెంట్లో ఇరుక్కున్నాడు. ఇతని పైన పోలీస్ స్టేషన్లో లో కేసు నమోదు అయ్యింది. కోర్టులో కూడా కేసు బుక్ అయ్యింది. దీంతో తన్ను కనిపించకుండా పోయాడు. మూడు రోజుల నుంచి తన్ను కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తమ కూమారుడు ఆచూకీ చెప్పాలని తన్ను కుటుంబ సభ్యులు అదే పోలీసు స్టేషన్ ను కాంటాక్ట్ చేశారు. తన్ను అచూకీని కనుకుంటామని పోలీసులు నచ్చ చెప్పి పంపారు. అయితే మూడురోజుల తరువాత తల్లికి ఒక వీడియో వచ్చింది.. ఇందులో తన్ను దెబ్బలను చూపుతున్న వీడియో పంపాడు. అయితే తనను మూడు రోజులు పోలీసులు స్టేషన్ల్ లో పెట్టి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని.. తాను మూడు రోజులుగా పోలీస్ స్టేషన్ లో నే వున్నానని..తనను కాపాడాలని తల్లికి సెల్ఫీ వీడియోను పంపాడు. దీంతో అవాక్కైన తల్లి వెంటనే పిఎస్ ను కాంటాక్ట్ చేసింది. అయితే మామూలుగానే పోలీసులు తమ వద్ద లేరని చెప్పారు. తమ కూమారుడు ని పిఎస్ లో ఉంచుకున్ని పోలీసులు సమాధానం చెప్పడం లేదంటూ ఉన్నతాధికారులకు ఈ సెల్ఫీ వీడియో ను పోస్ట్ చేసింది తల్లి. దీంతో ఉన్నతాధికారులు పిఎస్ వ్యవహారంపై విచారణ ను ఆరంభించారు. అయితే పోలీస్ ల కస్టడీలో తన్ను వున్నప్పటికీ తమ వద్ద లేడని ఎందుకు కోర్టులో పోలీసులు చెప్పారో అర్థం కావడంలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

