హీరో విశాల్ మామూలోడు కాదు ...

తమిళ హీరో విశాల్ పై ఐటి దాడి జరిగింది. వేల రూపాయల నోట్ల కట్టలముందు ఐటి అధికారులను విశాల్ ప్రాధేయపడుతున్న ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తాను చట్టబద్ధంగా సినిమాల్లో సంపాదించిన సొమ్ము అని విశాల్ చెబుతున్నాడు. కానీ అధికారులు లెక్కలో జమకాని మొత్తం అని వాదిస్తున్నారు. ఈ వివాదం సాగుతుండగా సీనియర్ హీరో అర్జున్ అక్కడికి వచ్చి అక్కడ సీన్ కి అంతా రెడీ రా అంటూ లాక్కెళతారు .
అసలు సంగతి అది ...
ఇటీవల మెర్సెల్ చిత్రం వివాదంలో చిక్కుకున్నప్పుడు హీరో విశాల్ ఆ సినిమాకి బహిరంగ మద్దతు ప్రకటించారు. ఆ తరువాత ఆయన కార్యాలయంపై ఐటి, విజిలెన్స్ దాడులు జరిగాయి. దానికి కౌంటర్ గా విశాల్ ఈ వీడియో ను సోషల్ మీడియా లో విడుదల చేసి తనకు జరిగిన అవమానానికి కౌంటర్ ఇచ్చారన్నమాట. అధికారులు ఏమి తనను పీకిందేమి లేదన్న సందేశాన్ని తనదైన శైలిలో చేసి చూపారు విశాల్. మొత్తానికి ఈ ఫెక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో దుమ్ము రేపుతోంది.
- Tags
- విశాల్

