హరీశ్ మొండోడన్న కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అనేకరకాలైన ప్రశ్నలు నెటిజన్లనుంచి ఎదురయ్యయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రీకృతంగా మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాలు, రంగాలను కలుపుకుంటూ సమ్మిళిత అభివృద్ది దిశగా పోతుందన్నారు. రక్షణ భూముల సేకరణ కష్టంగా ఉన్నందున స్కైవేల నిర్మాణం ఆలస్యం అవుతుందన్నారు. పాత బస్తీకి ఖచ్చింతగా మెట్రోరైలు వస్తుందన్నారు. నగరంలో డీజీల్ బస్సుల వలన కాలుష్యం పెరుగుతుందని, సిఏన్జీ, ఏల్పీజీ బస్సులు వినియోగం గురించి అడిగితే ఎలక్ర్టికల్ వాహనాలే సరైన పరిష్కారం అన్నారు. నగరంలో వైఫై ప్రాజెక్టు 1/3 పూర్తి అయ్యిందని , త్వరలోనే మరిన్ని హాట్ స్పాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేసేందుకే ఏకరాకు 4వేల సబ్సీడీ , రైతు సంఘాలు, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. 24 గంటల కరెంటు వలన భూగర్జ జలాలు సమస్య ఏర్పడకుండా ఆటో స్టార్టర్లను తొలగించాలన్నారు. త్వరలోనే లక్ష ఉద్యోగాల భర్తీ పూర్తవుతుందన్నారు. ముఖ్యమంత్రి గురించి ఒక్కమాటలో చెప్పమంటే సానూకూల ఫలితాలు సాధించే టాస్క్ మాస్టర్ అన్నారు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావడం లేదేందుకు అంటే ప్రభుత్వం, ప్రజలు వేరు అనే భావన ఉన్నదని, నిజానికి రెండు కలిస్తేనే ప్రజాసామ్యన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం మీదే అంటూ ఆంధ్రనెటిజన్ వేసిన కామెంటుకు ఎన్నికల గురించి వర్రీ లేదన్నారు. అన్ని మార్గాల్లో ప్రయత్నించిన తర్వతే పార్లమెంటులో తమ ఎంపీలు సభలో నిరసన తెలిపారన్నారు. రాజకీయాల్లో ఒకటి ఒకటి రెండు ఎన్నటికీ కాదన్నారు. కేంద్రకేబినెట్లో చేరుతారా అని అడిగితే ఉన్నదాంతోనే సంతోషంగా ఉన్నామన్నారు. రాహుల్ ద్రావిడ్, కోహ్లీ, రోహిత్ లు తన అభిమాన క్రికెటర్లుగా తెలిపారు. షారుఖ్ ఖాన్ తమ అభిమాన బాలీవుడ్ నటుడన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాకుండా బరాక్ ఒబామా తాను అధికంగా ఇష్టపడే రాజకీయ నాయకుడున్నారు.
ఇండియన్ చైనీస్ ను ఇష్టపడతా....
ఇండియన్ చైనీస్ తనకు ఇష్టమైన అహారం అన్నారు. అమెరికాలో ఉన్నప్పుడు వంట చేసిన విషయాన్ని తెలిపారు. అల్లు అర్జున్ గురించి చెప్పమంటే ఏనర్జీ, స్టైల్, స్వాగ్ అన్నారు. మహేష్ బాబు సూపర్ స్టార్, ప్రభాస్ బాహుబలి, జూనియర్ ఎన్జీయార్ ఒక ఫార్మర్, సచిన ఒక లెజెండ్, పవన్ కల్యాణ్ ఒక ఏనిగ్మా అని అన్నారు. ప్రజలే పవన్ కల్యాణ్ రాజకీయ జీవితాన్ని నిర్ణయిస్తారన్నారు.
రేవంత్ ఎవరో తెలియదు....
మంత్రి హరీష్ రావు గురించి అడిగితే మెుండి పట్టుదల కలిగిన హార్డ్ వర్కింగ్ నాయకుడన్నారు. టిఆర్ఎస్ ను ఆంధ్రలో విస్తరించే ఆలోచనలేవీ తనకు తెలియవన్నారు. అంధ్రప్రదేశ్ తమ సోదర రాష్ర్టమని తెలిపారు. తనకు అక్కడ ఒటు లేనందున టిడిపికి, వైసిపి ఒటేసిది చెప్పలేన్నారు. రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాట చెప్పమంటే అయన ఎవరు అని ప్రశ్నించారు. తాను దేవుడ్ని కాకుండా కర్మను నమ్ముతాన్నారు. ఫిట్ గా ఉండడమే కొత్త సంవత్సర తీర్మానమన్నారు. మెట్రో ప్రారంభం, జిఈఎస్ సమావేశం రెండు ఒక్క రోజు ఉండడమే ఈ ఏడాది గుర్తిండిపోయే రోజన్నారు.
- Tags
- కేటీఆర్

