Thu Mar 26 2026 05:49:43 GMT+0530 (India Standard Time)
స్పీకర్ విందుకు వైసీపీ డుమ్మా

ఉగాది సందర్భంగా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈరోజు ఇచ్చే విందుకు హాజరుకావడం లేదని వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు తెలిపారు. గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక బిల్లులను ఆమోదించుకుంటున్న ప్రభుత్వం , ప్రత్యేక హోదాపై తాము ఇచ్చిన అవిశ్వాసంపై చర్చకు మాత్రం ముందుకు రావడం లేదంటున్నారు. ఈ కారణంగానే స్పీకర్ విందుకు తాము గైర్హాజరవుతున్నట్లు ప్రకటించారు. చర్చ జరిగేంత వరకూ వైసీపీ నోటీసులు ఇస్తూనే ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈరోజు తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తూ 150 మంది ఎంపీలు లేచి నిలబడ్డారని వారు తెలిపారు. తిరిగి ఈరోజు కూడా అవిశ్వాసం నోటీసులను లోక్ సభ సెక్రటరీ జనరల్ కు ఇచ్చామని తెలిపారు.
- Tags
- వైసీపీ
Next Story

