Fri Apr 10 2026 19:44:11 GMT+0530 (India Standard Time)
స్పీకర్ తో వైసీపీ ఎమ్మెల్యేల భేటీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. ఇటీవల పార్టీ మారిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలపై కూడా వేటు వేయాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోనని చెప్పిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అనర్హత వేటు విషయంపై ఫిర్యాదు చేసేందుకే స్పీకర్ ను కలిశారు.
- Tags
- వైసీపీ
Next Story

