స్టార్ హోటల్ లో ఈ పనిచేస్తూ... పోలీసులకు పట్టుబడ్డ...?

తెలంగాణ మొత్తం మీద పేకాట క్లబ్లను ప్రభుత్వము మూసివేసింది. పేకాట రాయుళ్లు ఇప్పుడు కొత్త పద్దతుల్లో తమ దందా చేసుకుంటున్నారు. స్టార్ హోటల్ కేంద్రంగా ఈ పేకాట దందా నడుస్తుంది. నగరంలోని ప్రముఖ హోటల్లో ఇదంతా నడుస్తుంది.. రాజకీయ వేదికలకు పెట్టింది పేరుగా ఉన్న ఒక స్టార్ హోటల్లో ఈ పేకాట విచ్చలవిడిగా నడుస్తుంది. అందరు దీపావళి పండుగ చేసుకుంటుంటే పేకాట రాయుళ్లు మాత్రం స్టార్ హోటల్లో పేకాట ఆడుతున్నారు. సికింద్రాబాద్ మారియట్ హోటల్లో పెద్దెత్తున పేకాట నడుస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ అధికారులకు సమాచారం వచ్చింది. శుక్రవారం ఉదయం హోటల్ పై అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. మొత్తం 17 గదుల్లో ఈ పేకాట దందా నడుస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
మారియట్ హోటల్లో పేకాట.....
17 గదుల్లో పేకాటదందా మూడు రోజుల నుంచి ఆడుతున్నట్లుగా అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో 17 గదులను పోలీసులు తనిఖీ చేశారు. ఇందులో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నట్లుగా అధికారులు తేల్చారు. ఈ గదుల్లో 40 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నగరంలోని ప్రముఖులతోపాటు గా పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలున్నారు. వీరి వద్ద నుంచి లక్షల్లో నగదు తో పాటుగా హుక్కా. విదేశ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ 17 గదులను వారం రోజులకు సంజయ్ కుమార్, ప్రవీణ్ లు బుక్ చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇందులో సంజయ్ కుమార్ పారిపోయాడు. ప్రవీణ్ ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న 40 మందిని సికింద్రాబాద టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. కొన్నాళ్ల నుంచి ఈ హోటల్ పేకాటకు అడ్డాగానే మారిందని అధికారులు చెప్తున్నారు.
- Tags
- మారియట్ హోటల్

