Sat Apr 04 2026 03:12:40 GMT+0530 (India Standard Time)
సోమును సీరియస్ గా తీసుకోబోమన్న సోమిరెడ్డి

బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యలను తాము సీరియస్ గా తీసుకోబోమని మంత్రి సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలసి వెళ్తాయనే నమ్మకం తనకు ఉందన్నారు. 2014లో టీడీపీతో కాకుండా జగన్ తో వెళ్దామని సోము వీర్రాజు అనుకున్నారా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడో, జాతీయ అధ్యక్షుడో మాట్లాడితే ఆలోచిస్తాంకాని, సోము వీర్రాజు వ్యాఖ్యలను పట్టించుకోబోమన్నారు. మోడీ, చంద్రబాబుల మధ్య సయోధ్య ఉందన్నారు. సోము వీర్రాజు కాని, రాజేంద్రప్రసాద్ కాని రెచ్చగొట్టడం మానుకోవాలని సోమిరెడ్డి హితవు పలికారు. కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తుందని, తాము మరిన్ని నిధులను ఆశించడంలో తప్పులేదని సోమిరెడ్డి అన్నారు.
- Tags
- సోమిరెడ్డి
Next Story

